Mar 21,2023 19:01

గుడ్డలు పంపిణీ చేస్తున్న పార్లమెంట్‌ బీసీ సెల్‌ స్పోక్‌ పర్సన్‌ సల్లా నాగరాజు

పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

ప్రజాశక్తి - చాగలమర్రి

స్థానిక శివాలయం కాలనీలోని టిడిపి నంద్యాల పార్లమెంట్‌ బీసీ సెల్‌ స్పోక్‌ పర్సన్‌, సమరసత సేవా ఫౌండేషన్‌ నంద్యాల జిల్లా సహా కన్వీనర్‌ సల్లా నాగరాజు యాదవ్‌ ఉగాది పండుగను పుష్కరంచుకొని పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు పరిశుభ్రం చేయడం వల్లనే పట్టణ ప్రజలు రోగాల బారినపడకుండా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి నరసింహులు, చోటు, కాశినేని ఓబులేసు, నాగార్జున, బోడళ్ళ ఓబులేసు, బాలు, అబ్దుల్లా, నరేంద్ర, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.