Nov 02,2023 22:49

కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి సురేష్‌


ప్రజాశక్తి-యర్రగొండపాలెం
నిరుపేదలైన వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు అండగా ఉండడం హర్షించదగిన విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం యర్రగొండపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హార్ట్‌ లాండ్‌ గ్రేస్‌ అజ్‌ ట్రస్ట్‌ తరుపున పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎనిబెర మమత బెంజిమెన్‌ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సురేష్‌ చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సురేష్‌ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలలో ఆర్థికంగా నిరుపేదలైన వద్ధులను, వికలాంగులను, మానసిక వికంగులను గుర్తించి వారికి హార్ట్‌ లాండ్‌ గ్రేస్‌ అజ్‌ ట్రస్ట్‌ అధినేత ఎనిబెర మమత బెంజిమెన్‌ వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావడం హర్షించదగిన విషయమని మంత్రి అన్నారు. రాబోయే రోజులలో నియోజకవర్గ పరిధిలో వారి యొక్క స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను విస్తతంగా విస్తరింపజేసేలా కషి చేయాలని ఆయన అభిలాషించారు. ఇలాంటి గొప్ప స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న హార్ట్‌ లాండ్‌ గ్రేస్‌ హజ్‌ ట్రస్టు అధినేత మమత బెంజిమెన్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. ట్రస్ట్‌ చైర్మన్‌ మమతా బెంజిమెన్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో తాము చేపడుతున్న మా సేవా కార్యక్రమాలను రాష్ట్ర పురపాలక పట్టణ అభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, స్థానిక నాయకుల సహకారంతో మా ఈ ట్రస్ట్‌ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన అన్నారు. అనంతరం మంత్రి సురేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల ఎంపిపి దొంత కిరణ్‌ గౌడ్‌, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల వైసిపి కన్వీనర్‌ ఓబుల్‌రెడ్డి, సర్పంచ్‌ ఆరుణాబాయి, ఈవోఆర్డీ ఈదుల రాజశేఖర్‌ రెడ్డి, జడ్పి కో ఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌ షాబీర్‌ బాషా, వైసిపి నాయకులు వెంకటరెడ్డి, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.