ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండల వ్యాప్తంగా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎంపిడిఒ కెఆర్‌ఎస్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆయా పంచాయతీల పరిధిలో పనిచేసే సిబ్బందికి జీలుగుమిల్లి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మొత్తం 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కోర్స పోసమ్మ, జెడ్‌పిటిసి వసంతరావు, సర్పంచి చీర్రి జగదాంబ, వైద్య సిబ్బంది గాయత్రి, సిహెచ్‌ఒ శ్రీనివాసరాజు, మంగ, పంచాయతీ కార్యదర్శులు దేవప్రియుడు, అశోక్, సుబ్రమణ్యం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముసునూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారిశుధ్య కార్మికులను గుర్తించి వారికి వైద్య సేవలందించడం ఎంతో గర్వకారణమని ఎంపిడిఒ జి.రాణీ తెలిపారు. సోమవారం మండలకేంద్రమైన ముసునూరులో గాంధీజీ జయంతి సందర్భంగా పిహెచ్‌సి వద్ద క్లాప్ మిత్ర వైద్య శిబరం నిర్వహించి, వారికి ఉచితంగా వైద్యం అందించి, మందులు అందజేశామని వైద్యలు యం.కిరణ్‌కుమార్, కరిముల్లాలు తెలిపారు.










