పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం- సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేషన్
కడప : పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రత, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని సఫాయి కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేషన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లాలోని సఫాయి కర్మచారీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వి.విజరు రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో వెంకటేషన్ మాట్లాడుతూ ఈ రోజు సమాజం ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉందంటే పారిశుధ్య కార్మికుల శ్రమ ఫలితమేనన్నారు. పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాలు ఆరోగ్య వంతం గా ఉంటేనే నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఆరోగ్యవంతంగా ఉంటా యన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరి స్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆవాస్ యోజన ద్వారా హౌసింగ్ పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికీ తీసుకురావాలని తెలిపారు. ప్రతి నెలా రెండవ సోమవారం కార్మికుల సమస్యలను విన్నవించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించేలా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదే శించారు. మహిళా కార్మికుల సమస్యలను గుర్తించి, పరిష్కార చర్య లను చేపట్టాలని ఆదేశించారు. కార్మికులందరికీ ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ ఖాతాలు నమోదు చేయించాలని, కార్మికుల కుటుంబాలన్నింటికి హెల్త్ కార్డులను అందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు చెందిన పారిశుధ్య కార్మికులు హాజరై వత్తి పరంగా, ఆర్ధికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ కమిషన్ చైర్మన్ వెంకటేషన్ దష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జెసి గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, ఎఎస్‌పి తుషార్ డూడీ, శిక్షణ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్‌డిఒ ధర్మ చంద్రారెడ్డి, జడ్‌పి సిఇఒ సుధాకర్‌రెడ్డి, డిపిఒ ప్రభాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, ఎస్‌సి, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ఇడిలు డాక్టర్ హెచ్.వెంకట సుబ్బయ్య, డాక్టర్ వి.బ్రహ్మయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ హిమదేవి పాల్గొన్నారు.










