
సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి వినతి
ప్రజాశక్తి - పెనుగొండ
పారిశుధ్య కార్మికులకు టెండర్ విధానం రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెనుగొండ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి మహంత్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు టెండర్ విధానం రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అధిక ధరలతో సతమతమవుతున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పంచా యతీ యాజమాన్యాలు కార్మికుల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను శుభ్రం చేస్తున్న కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నా, రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే పరిస్థితి గ్రామాల్లో లేదని విమర్శించారు. మరోవైపు మండలంలోని పలు పంచాయతీల్లో యాజమాన్యం కార్మికు లను చిన్నచూపు చూస్తుందని, పని నుంచి అక్రమంగా తొలగించినా అధికా రులు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణం ఉన్నతాది óకారులు స్పందించి మండలం లోని అన్ని పంచాయతీ కార్మికుల స్థితిగతులను పట్టించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు బంగారు విజయ, లలిత, వాణిశ్రీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.