Apr 20,2023 17:21

కార్మికులకు యూనిఫాం పంపిణీ చేస్తూన్నా గుండం శేషిరెడ్డి

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ప్రజాశక్తి బనగానపల్లె

      పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలుకూరు గ్రామంలో   గ్రామపంచాయతీకి చెందిన25  మంది పారిశుద్ధ్య కార్మికులకు  80,000 రూపాయల విలువచేసే యూనిఫామ్ దుస్తులను   వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండంశేషి  రెడ్డి మాట్లాడుతూ  పారిశుద్ధ్య కార్మికుల విధులు వర్ణించలేనివని అన్నారు. పలుకూరు గ్రామం లో నిత్యం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటుందని , మైనింగ్ ఎక్కువగా ఉంటుందని అందుకు తగ్గట్టు పారిశుధ్య కార్మికులు ప్రతినిత్యం పలుకూరు గ్రామాన్ని సుందరంగా వుంచడానికి తమ వంతు సహాయ సహకారాలు మరువలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసులు, సర్పంచ్ కోనేటి సుమలత ,సచివాలయ కన్వీనర్ వెంకటేష్ , జాను ,రాంబాబు పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.