
విధులు బహిష్కరించిన పారిశుద్య కార్మికులు
ప్రజాశక్తి-గొలుగొండ:తమకు బకాయి ఉన్న మూడు నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్‌పురం పారిశుద్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్య కార్మికులు మాట్లాడుతూ, సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా బకాయి జీతాలు చెల్లించాలని కోరారు.