Dec 02,2022 23:58

నిరసన చేపడుతున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి-గొలుగొండ: బకాయి వేతనాలు తక్షణమే ఇవ్వాలని మండలంలోని మేజర్‌ పంచాయతీ ఏఎల్‌పురంలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. సుమారు రెండు సంవత్సరాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశామని, దీంతో గత ఆరు నెలల కిందట నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ వేతనాల చెల్లింపునకు హామీ ఇచ్చి, ఇంత వరకు ఆ హామీ నెర వేర్చలేదన్నారు. తక్షణమే తమకు ఇవ్వాల్సిన బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.