పారిశుధ్య కార్మికుల మానవహారం
ప్రజాశక్తి-కావలి రూరల్ : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు పర్మినెంట్ చేయాలని, డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్‌లో చేర్చాలని, కార్మికులకు రిటైర్మెంట్ బెనెఫిట్స్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని, ఆక్పస్ విధానం రద్దు చేయాలని, పని భారం తగ్గించాలని, క్లాప్ డ్రైవర్లకు రూ.18500 వేతనం ఇవ్వాలని, ఇప్పటికే కార్మికులు అనేక సందర్భాలలో పోరాటాలు చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. కార్మికల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు మాస్టర్లు ఆపివేసి అధిక సంఖ్యలో పాల్గొని చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి మధుసూదన్ రావు, మేడ వెంకటేశ్వర్లు, తురక సీనయ్య, బిడదల మహేష్, నాయకులు జలదంకి బాబు, ఒంగోలు రమేష్, జే జేమ్స్, శివకోటయ్య, మహిళా నాయకులు పల్లెపాటి అనిత, పరుసు చిన్నమ్మ పాల్గొన్నారు.










