Sep 14,2023 00:26

ప్రజశక్తి - చీరాల
పారిశుద్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రామకృష్ణాపురం పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ కె ఉమా అన్నారు. పంచాయతీలో పారిశుధ్య పనులను ఆమె బుధవారం పరిశీలించారు. కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీలో నెల రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి ఎం కిరణ్ కుమార్ తెలిపారు. దోమలు నివారణకు ఫాగింగ్, రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోని పంచాయతీ అభివృద్ధికి సహకరించాలి కోరారు. సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.