ప్రజాశక్తి-కంచికచర్ల : మండల పరిధిలోని పరిటాల గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్ లను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పంపిణీ చేశారు . శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి మీర్జావలి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి కషి చేస్తుందని, గతంలో కంటే వైయస్ జగన్ ప్రభుత్వంలో కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు వారి వత్తి నిర్వహించడానికి అవసరమైన పనిముట్లను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. గ్రామ సర్పంచ్ యద్దనపూడి ఆనంద జోష్ణ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్త రజిని శ్రీనివాస్ పాల్గొన్నారు.










