కడప అర్బన్ జిల్లాలోని కొప్పర్తి మెగా ఇండిస్టి యల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామికరంగం పరుగులు పెడుతుందని ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడవ రోజు పర్యటనలో భాగంగా రూ.871 కోట్ల వ్య యంతో కూడిన పలు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. కొప్పర్తి మెగా ఇండిస్టియల్ పార్క్‌లో ఆల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించారు. టెక్నోడోమ్, వర్చువల్ మేజ్ సంస్థలకు, శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అభివద్ధి చేస్తున్న ''వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్'' వైఎస్‌ఆర్ జిల్లాకే తలమానికంగా అభివద్ధి చెందుతున్న కొప్పర్తిలోని వైఎస్‌ఆర్‌ఇఎంసిలో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు ముం దుకు వచ్చిందని తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహ నాల కు వాడే బ్యాటరీలు, జిపిఎస్ ట్రాకర్, స్మార్ట్ పిస ిబి వంటి అధునాతన డివైస్ పరికరాలను ఉత్పత్తి చేసే యూనిట్ స్థాపన రూ.71.10 కోట్ల పెట్టుబడితో 7.210 ఎకరాల్లో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 1,350 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని తెలి పారు. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొం దిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న ''టెక్నో డోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'' కన్సుమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ వైఎస్ ఆర్‌ఇఎంసిలో రూ.52 కోట్ల పెట్టుబడితో ఉత్ప త్తుల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు శంకు స్థాపన చేశామని పేర్కొన్నారు. కొప్పర్తిలో రూ. 100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగా లను ఉత్పత్తి చేయనుందని పేర్కొన్నారు. కార్య క్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవ హర్‌రెడ్డి, సిఎం ముఖ్యకార్యదర్శి ధనుం జయ రెడ్డి, ఒఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి ఎస్‌బి.అంజాద్‌బాషా, ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియాఖనమ్, ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామ చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీ ర్‌రెడ్డి, సుధ, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, ఉద్యాన సలహాదారు శివప్ర సాద్‌రెడ్డి, కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్, జెసి గణేష్‌కుమార్ పాల్గొన్నారు.










