కడప అర్బన్ : 28 యూనిట్లకు రూ.1.43 కోట్ల మేర రాయితీలు మంజూరు జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తత పరచాలని కలెక్టర్ వి.విజరురామరాజు డిఐఈపిసి సభ్యులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డిఐఈపిసి) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్ర మలే జిల్లా ఆర్థిక ప్రగతికి ప్రధానం అన్నారు. ఆ దిశగా జిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి పథంలోకి తీసుకు రావాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసి జిల్లా ఆర్థిక అభివద్ధికి దోహద పడడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అంది వ్వాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు దష్టి సారించాలన్నారు. పరిశ్రమల స్థాపన వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడంతో పాటు జిల్లా ఆర్ధిక ప్రగతి కూడా మెరుగుపడుతుందన్నారు. పారిశ్రామిక అభివద్ధి పాలసీ (ఐ.డి.పి.) 2015-20, 2020-23 లను అనుసరించి జిల్లాలో అన్ని సెక్టార్లలోని మొత్తం 28 యూనిట్లకు గాను రూ.1.43 కోట్ల రాయితీ మొత్తం విడుదలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్‌కు వివరించగా ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశంలో అద నపు కలెక్టర్ రాహుల్ మీనా, కార్పొరేషన్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, కమిషనర్ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాస మూర్తి, డిప్యూటీ చీఫ్ కష్ణ మూర్తి, లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ దుర్గాప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ ల్, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్ పిడీసీఎల్, లేబర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు
కడప : మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్‌లో జిల్లాలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపె కలెక్టర్ వి.విజరు రామరాజు అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌పి అన్బురాజన్, నగర కమిషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సంబందిత శాఖల అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పటిష్టమైన నిఘా చర్యలు అవలంభించాలని తెలిపారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. మాదకద్రవ్యాలు విక్రయాలు జరిగే చోట గట్టి నిఘా ఉంచాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు. బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పునరావాసం కల్పించాలని అన్నారు. జిల్లాలో ప్రతి మెడికల్ షాప్‌లోనూ సిసి టివి కెమెరాలు ఏర్పాటుచేసి నిషేధిత మందుల అమ్మకాలను అరికట్టడంతో పాటు '18 సం లోపు బాలలకు డాక్టర్ ప్రెస్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు ఇవ్వబడవు ! ' అనే సూచిక బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూల్స్, కళాశాల డాబాలలో, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో బోర్డులు మత్తు పదార్థాల నివారించే చర్యలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంక టేశ్వర్లు, వెంకటరమణ, పోలీసు, ఎస్సైజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.డిఇఐఇపిసి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజరురామరాజు










