ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాతలు 108 వెండి పుష్పాలను అందించారని ఆలయ కార్య నిర్వాహణాధికారి మానిక్యాల రాంబాబు తెలిపారు. శనివారం మొక్కులు చెల్లించడానికి వచ్చిన జంగారెడ్డిగూడెం నివాసులు శ్రీనివాస్, ధనలక్ష్మి, కుటుంబ సభ్యులు 108 రజిత పుష్పాలు అందించారన్నారు. అలాగే అన్నప్రసాద వితరణ దాతలు నూలకాని శ్రీనివాస్ జ్యోతి, వెంకట్రావు, పార్థసారథిల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రెడ్డి రంగప్రసాద్, వాసవిశాయి నగేష్ పాల్గొన్నారు.










