ప్రజాశక్తి- సంతమాగులూరు
రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా పారదర్శకంగా అన్ని సామాజిక వర్గాలకు, సమన్యాయం చేకూర్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ కన్వీనర్ బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. మండలంలోని పత్తేపురం సచివాలయం పరిధిలోని బండివారిపాలెంలో 2వ రోజు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి గత నాలుగేళ్లుగా ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్ధిని వివరించారు. గ్రామంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మరో సారి జగనన్న సిఎం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని కోరారు. పథకాలు అమలు చేస్తే శ్రీలంకలా మారుతుందని గతంలో చంద్రబాబు అన్న మాటలు గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచి పుడమి సరోజిని, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ చింతా రామారావు, నాయకులు బండి వెంకటరావు, బండి శ్రీనివాసరావు, ఓరుగంటి కోటిరెడ్డి, అట్లా పెద్దవెంకటరెడ్డి, కొల్లి వెంకటరావు, బండి కోటిరెడ్డి పాల్గొన్నారు.










