
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు
ప్రజాశక్తి - కాళ్ల
సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ జగనన్న ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు (వాసు) అన్నారు. కాళ్లలో వైసిపి మండల అధ్యక్షులు గణేశ్న రాంబాబు అధ్యక్షతన జరిగిన జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాతపాటి వెంకట శ్రీనివాసరాజు పాల్గొని మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ పార్టీలకతీతంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. గ్రామాల్లో కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు అందించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం గ్రామంలో సంక్షేమ పథకాలు డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బ్రోచర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి పి.సోమేశ్వరరావు, ఎంపిపి పెనుమత్స శిరీష విశ్వనాథరాజు, దేవస్థానం ఛైర్మన్ గని శెట్టి షణ్ముఖ, మాజీ సర్పంచి గంటా ఆనందరావు, వైసిపి నాయకులు గంటా బాలు, అబ్బులు, నాగేశ్వరరావు, పంచాయతీ గ్రామ కార్యదర్శి బి.సతీష్‌కుమార్, సచివాలయం-2 కార్యదర్శి సింధుజా పాల్గొన్నారు.