ప్రచారం నిర్వహిస్తున్న అక్కరమాని విజయనిర్మల తదితరులు
ప్రజాశక్తి - ఆరిలోవ : సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రతి లబ్ధిదారునికీ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల అన్నారు. సోమవారం 13వ వార్డు పైనాపిల్ కాలనీ, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో వార్డు కార్పొరేటర్ కెల్ల సునీతతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానిక సమస్యలనడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోతే సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అక్కరమాని వెంకటరావు, కెల్ల సత్యనారాయణ, శిరీషా తదితరులు పాల్గొన్నారు.










