
ప్రజాశక్తి - నెల్లూరు :జిల్లాలో సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ అత్యంత పార దర్శకతతో కొనసా గుతుందని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్‌ను డిసెంబర్, 26వ తేదీ నాటికి పరిష్కరించాలని కలెక్టర్ ఎం హరి నారా యణన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ హరి నారాయణన్ సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ డిశంబరు 9 వరకు స్వీకరించిన అభ్యంతరాలను డిసెంబర్ 26వ తేదీ నాటికి పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి కషిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ను పూర్తిస్థాయిలో నియమించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్, రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, వైఎస్‌ఆర్సిపి ప్రతినిధులు వెంకట శేషయ్య, టిడిపి ప్రతినిధులు భువనేశ్వర ప్రసాద్, బిజెపి ప్రతి నిధులు శ్రీనివాస్, బి..ఎస్.పి ప్రతినిధులు శ్రీరామ్ ఉన్నారు