Sep 19,2023 21:40

ప్రజాశక్తి-అమలాపురం
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను పారదర్శకంగా రూపొందిం చాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంబంధిత అసెంబ్లీ నియోజక వర్గాల వారీ ఓటర్‌ నమోదు అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా 26 జిల్లాల కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓ టర్‌ జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియ సంబంధించి క్లైయిమ్‌; అభ్యంత రాల పరిష్కారం, మరణించిన వలసలు వెళ్లిన వారి ఓట్లు జాబితాలో తొలగింపు, ఓటర్‌ జాబితాలో గుర్తించిన తప్పులు తొలగింపు సరిదిద్దడం, ఒకే డోర్‌ నంబర్‌లో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదు చేసుకున్నవారు,'0' ఇంటి నంబర్‌ తో ఉన్న ఓటర్లు , ఒకే ఇంటి సంఖ్య లో పది మందికి పైబడి ఉన్న ఓటర్లు, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఓటర్లు తదితర అంశాల సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సంకీర్త సవరణ-2024 అత్యంత పారద ర్శకంగా చేపట్టి ఎక్కడ ఎటువంటి ఫిర్యాదుకు తావివ్వకుండా ఖచ్చిత త్వంతో రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబు, ఆర్‌డిఒలు ఎం.ముక్కంటి వసంతరాయుడు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత శాఖ అధికారి జివి.సత్యవాణి, జిల్లా పరిషత్‌ సిఇఒ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.