ప్రజాశక్తి-కాకినాడ రూరల్ అధికారులు బూత్ స్థాయిలో పర్యటించి ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండు లక్షల 55 వేల 38 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కరప, కాకినాడ రూరల్ మండలాల్లో 264 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాలను బూత్ అధికారులు సందర్శించి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రూరల్ తహసీల్దార్ మురార్జీ, కరప తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీనివాస్, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.










