ప్రజాశక్తి-అమలాపురం
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రాథమిక స్థాయి తనిఖీ నిర్వహించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతిని ధులు తప్పనిసరిగా హాజరుకా వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించిన పురోగతి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రాథమిక స్థాయి తనిఖీ గూర్చి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఈనెల 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ముమ్మడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల నందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రాథమిక స్థాయి తనిఖీ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్లు అనుసంధానించి పనితీరును 11 మంది భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంజనీర్లతో రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో సిసి కెమెరాల నిఘాలో పరిశీలన చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్‌లో 16 స్థానాలకు సంబం ధించిన బటన్‌ల పనితీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. సింబల్ లోడింగ్, కంట్రోల్ యూనిట్ పేపర్ సీలింగ్ లు కూడా రాజకీయ పార్టీలు ప్రతినిధులు సమక్షంలో జరుగుతుందన్నారు భారత్ ఎన్నిక ల సంఘం ఒక్కొక్క ఇంజినీర్‌కు రోజుకు 15 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తనిఖీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. 25 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగు తుందన్నారు. ప్రాథమిక స్థాయి తనిఖీకి హాజరయ్యే రాజకీయ పార్టీలు ప్రతినిధులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుంచి ఈ తనిఖీ ప్రక్రియలో హాజరయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రతినిధులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 27వ తేదీన ముసా యిదా ఓటర్ జాబితా ప్రచురితం అవుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కూడా అదే తేదీ నుంచి ఆరంభం అవుతుందన్నారు సర్వీస్ ఓటర్లు కూడా ఈ నెల 27 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన అన్నారు. ఎపిక్ కార్డులు పోస్టు ద్వారా రావడం జరుగుతుందనిస్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయి తనిఖీకి హాజరయ్యే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సందేహాలను ఆయన సందర్భంగా నివత్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కామన్ ప్రభాకర్ రావు, టిడిపి తరపున అల్లా స్వామి నాయుడు బిజెపి తరఫున డి.రాజేష్, వైసిపి తరఫున షేక్ అబ్దుల్ ఖాదర్, బిఎస్‌పి తరఫున కె.చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
20న కె.గంగవరంలో మండల స్థాయి స్పందన
రామచంద్రపురం డివిజన్లోని కె.గంగవరం మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాల యంలో ఈనెల 20వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుం జిల్లా పరిధి లోని మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి మండల స్థాయి స్పందన కార్య క్రమాన్ని సద్విని యోగపరుచుకుని తమ తమ సమస్యలు పరిష్కరించుకోవా లని ఆయన ఆ ప్రకటనలో ఆయా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం కె.గంగవరం మండలంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం శుక్రవారం జరుగుతుందని మండల పరిషత్ అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.










