Aug 17,2023 00:15

రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న డిఆర్‌ఒ వినాయకం

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో ఇంటింటికీ జరుగుతున్న ఓటరు సర్వేలో ఎటువంటి అభ్యంతరాలకు తావులేకుండా పార దర్శకంగా నిర్వహిస్తున్నామని పల్నాడు జిల్లా డిఆర్వో కె.వినా యకం అన్నారు.బుధవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇంటింటికీ నిర్వహిస్తున్న ఓటరు సర్వే కార్య క్రమంపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చించారు. అనంతరం పల్నాడు జిల్లా డిఆర్వో కె.వినాయకం మాట్లాడుతూ ఇంటింటికీ ఓటరు సర్వే విజయవంతమ య్యేందుకు స్థానిక ఓటర్లు,వివిధ రాజకీయ పార్టీ నేతలు బిల్వోలకు సహకరించాలని తెలిపారు