ప్రజాశక్తి-విఆర్ పురం
ఆర్ అండ్ ఆర్ ఇళ్ల సర్వేను అధికారులు నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా నిర్వహించాలని రేఖపల్లి గ్రామ సర్పంచ్ పూనెం సరోజినీ విజ్ఞప్తి చేశారు. గురువారం మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో పోలవరం భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ఇళ్ళ సర్వేను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పోలవరం కారణంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎక్కడ అన్యాయం జరగకుండా అధికారులు సర్వేలను చేపట్టాలని సూచించారు. బాధితులు ఇల్లు, ఇంటి ఆవరణలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ వివిధ ఫలసాయాల చెట్లు విధిగా నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు, జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల నాయకులు పంకు సత్తిబాబు, నాల్లారపు ప్రకాష్‌రావు, గుండెపుడి లక్ష్మణరావు, కమ్మ చిచ్చు సత్తిబాబు, రేఖపల్లి పంచాయతీ కార్యదర్శి, ఆర్ అండ్ ఆర్ అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు.










