Nov 02,2022 22:33

ప్రజాశక్తి - మండవల్లి
               భూ రీ సర్వే పనులను ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో మండలంలోని పుట్లచెరువు పసలపూడి చింతలపూడి శోభనాద్రిపురం గ్రామాల్లోని భూ రీ సర్వే రికార్డులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సర్వేయర్లు, విఆర్‌ఒలతో మాట్లాడారు. భూ రీ సర్వేను వేగవంతం చేయాలని తెలిపారు. పాస్‌బుకులు పరిశీలించి రిజిస్ట్రేషన్‌ ప్రకారమే పెండింగ్‌ లేకుండా భూ రీ సర్వే నిర్వహించాలన్నారు. రీ సర్వేలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహశీల్దార్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు సర్వేర్లకు సమావేశం నిర్వహించి రీ సర్వేకు సంబంధించిన సలహాలను సూచనలను అందించాలని ఆయన తహశీల్దార్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జనార్దన్‌రావు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.