May 30,2023 22:27

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి సతీష్‌కుమార్‌

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లో అనుబంధ విభాగాల్లో ఓకే చోట ఐదు సంవత్సరాలుగా పనిచేసి, పూర్తి చేసుకున్న కానిస్టేబుల్‌ స్థాయి నుండి ఎస్‌ఐ స్థాయి వరకు పోలీస్‌ సిబ్బంది బదిలీల ప్రక్రియల పూర్తి పారదర్శంగా నిర్వహిస్తామని ఎస్‌పి సతీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన పోలీస్‌ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది పోలీస్‌ స్టేషన్లో ఖాళీల వివరాలను సులువుగా ఎంపిక చేసుకునే విధానం సులువుగా ఎంపిక చేసుకున్న విధంగా కౌన్సిలింగ్‌ నిర్వహించామని, సిబ్బందిని ఒక్కొక్కరు అని పిలిచే ఇదివరకు పనిచేసిన సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ సొంతం మండలాలను మినహాయించి మిగలిన పోలీస్‌ స్టేషన్లో ఖాళీల ఆధారంగా ప్రొజెక్ట్‌ స్క్రీన్‌ ద్వారా చూపించే వరకు కోరుకున్నచోట బదిలీలు ఇచ్చినట్టు తెలిపారు. బదిలీల కౌన్సిలింగ్‌కు మొత్తం 53 మంది సిబ్బంది పిలువగా వారిలో ఒక ఎస్‌ఐ, నలుగురు హెడ్‌ కానిస్టేబుల్‌, 48 మంది పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఉన్నారన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి పి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.