ప్రజాశక్తి-నగరి: పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఆర్డీవో సుజన అన్నారు. గురువారం స్థానిక మెప్మా కార్యాలయంలో బి.ఎల్.ఓ సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు, అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ 2024కి సంబంధించి గత నెల 27న ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. ఆ జాబితాను మరొకమారు పరిశీలిం చాలని పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అందరూ కలసి పని చేయాలని సూచించారు. రాబోవు సాధారణ ఎన్నికల దృష్ట్యా స్వీప్ ఆక్టివిటీస్‌ని ముమ్మరం చేయుటకు, జెండర్ రేషియో, ఈపీ రేషియోపై ప్రత్యేక దృష్టి సారించండం, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయండంపై బీఎల్‌వోలకు శిక్షణ అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆర్వీ ప్రసాద్, టీపీవో నీరజాక్షి, అర్బన్ లెవల్ టీం, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: బిఎల్‌వోలు క్షేత్రస్థాయి ఓట్ల పరిశీలన చేయాలని ఇంచార్జ్ తహశీల్దార్ అనిల్‌కుమార్ అన్నారు. గురువారం మండల కార్యాలయంలో బిఎల్‌వోల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్ లిస్ట్‌ను పరిశీలించి మరణించిన వారిని గుర్తించి కుటుంబ యజమానుల అనుమతితో తొలగించే కార్యక్రమం చేపట్టాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి నూతన ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపిడివో హరిప్రసాద్‌రెడ్డి, డిటి ఇబ్రహిం తదితరులు పాల్గొన్నారు.










