పర్యాటక బోట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
నాలుగు నెలలు అనంతరం రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ ఉత్తర్వులు మేరకు శనివారం పాపికొండల విహరయాత్రకు సంబంధించిన బోట్లును అధికారులు ప్రారంభించారు. గండి పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి శనివారం విహారయాత్ర బోటుల ట్రైలర్ రన్ చేసి పరిశీలించారు. నాలుగు నెలల నుండి అధిక వర్షాలు, గోదావరి వరదల వలన నిలిచిపోయిన విహారయాత్ర బోట్లను తిరిగి శనివారం ప్రారంభించినట్లు మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. బోట్ల లైసెన్సులతో పాటు పూర్తి భద్రతా కిట్లుతో బోట్లను నడపడం జరుగుతుందని చెప్పారు. పాపికొండల విహారయాత్రకు సందర్శకులు అందరూ రావచ్చని పేర్కొన్నారు.










