
ప్రజాశక్తి-ఘంటసాల : ఘంటశాల మండలం, దాలిపర్రు గ్రామ ప్రముఖ రైతునాయకులు, కెసిపి చెక్కర కర్మాగారం కార్మిక సంఘం అధ్యక్షులు మిక్కిలినేని పాపారావు రెండవ కుమారుడు మిక్కిలినేని శేషగిరిరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబులు దాలిపర్రులో పాపారావును, మిక్కిలినేని మధులను పరామర్శించి శేషగిరిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శేషగిరిరావు మరణం గురించి అడిగి తెలుసుకున్న నాగిరెడ్డి, ఎమ్మెల్యే రమేష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.పాపరావును పరామర్శించిన వారిలో సర్పంచ్ డోకిపర్తి శాంతకుమారి, కూనపురెడ్డి శ్రీనివాసరావు, జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి రామకష్ణ, తదితరులు ఉన్నారు.