మాట్లాడుతున్న డాక్టర్ ఎంవి రమణయ్య
పాముకాటుకు నాటు వైద్యం ప్రమాదకరం
ప్రజాశక్తి-డెస్క్:పాము కాటుకు ఎలాంటి నాటు వైద్యం పనిచేయదనీ, ఆలస్యం చేయకుండా ఆసు పత్రులకు తీసుకెళ్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదని నెల్లూరు డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సీనియర్ వైద్యులు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి.రమణయ్య చెప్పారు. ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాముకాటుకు గురైన తర్వాత వెంటనే గంటలోపు ప్రాథమిక్యం అందించాలని కోరారు. నాటువైద్యం పేరిట ఆలస్యం చేస్తే ఒంట్లోకి విషం ప్రవేశించి ప్రమాదకర మైనవైతే చనిపోయే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావనీ, నాగు, కట్ల పాములు ప్రమాదకమైననీ, వీటి కాటుకు గురైతే ప్రాణాపాయం కూడా ఉంటుం దన్నారు. విషం శరీరంలోకి పాకకుండా నియంత్రించే ఏర్పాట్లు చేయొచ్చునం టున్నారు. కాటు వేసింది ప్రమాదకమైందా? కాదా? అనేది రోగి లక్షణాలను బట్టి ఇట్టే తెలుసుకోవచ్చునన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఏటేటా ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాముకాటు బాధితులు రోజురోజుకూ వందల్లో పెరిగిపోతుంటారు. నాగు పాము చాలా పెద్దదని, దాని విషం అన్నింటికంటే ప్రమాదకరమైనదని చాలామంది అనుకుంటారనీ, దానికంటే కట్ల పాము ప్రమాదకమైందన్నారు. నాగుపాము కంటే సైజులో చాలా చిన్నదైనా దరిదాపుగా 16 రెట్లు విషం ఎక్కువగా ఉంటుందన్నారు. కట్ల పాము కాటులో ఇంకొక ప్రమాదం కూడా దాగుందన్నారు. పెద్దగా నొప్పి లేకపోవడం గమనించాలన్నారు. పాము కంటే తేలు ప్రమాదకరమైందన్నారు. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుందన్నారు. తేలు విషానికి మందులేదన్నారు. ఆలస్యం చేయకూడదనీ, ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యమన్నారు. తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించు కోవడం అందులో ప్రధానంమన్నారు. భరించలేనంత తీవ్రంగానూ, చెప్పనలవి కాని విధంగా ఉంటుందన్నారు. నొప్పిగా, తిమ్మిరిగా, పైకి పాకినట్టుగా ఉంటుందన్నారు. సాధారణంగా నొప్పికి వాడే సూది మందుకు ఈ నొప్పి జవాబు చెప్పదన్నారు. చల్లటి కాపటంతో ఈ నొప్పిని చాలావరకు తగ్గించుకోవ చ్చునన్నారు. పాముకాటైనా, తేలు కుట్టినా పిహెచ్‌సిలలో ప్రాథమిక వైద్యం, ఆ తర్వాత ఆసుపత్రుల్లో డాక్టర్ ద్వారానే మిగిలిన వైద్యం చేయించుకోవా లన్నారు.










