
అత్తిలి :పాలూరులో పొలంబడి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ రాజేష్ రైతులతో మాట్లాడారు. రైతులు యాజమాన్య పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. పొలంబడి కార్యక్రమం ప్రతి వారమూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఎ సాహిత్య, రాము, గ్రామ సర్పంచి దైవమణి, ఉప సర్పంచి సింహాచలం, ఎంపిటిసి రామలింగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.