Nov 11,2023 23:12

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని వెంటనే ఆపాలని శ్రీ వెంకటేశ్వర కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కెవిఆర్‌ఎన్‌.నరసింహారావు అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో యుద్ధం ఆపాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. భూపయ్య అగ్రహారంలోని కళాశాల నుంచి హైస్కూల్‌ సెంటర్‌ వరకు యుద్ధం వద్దు శాంతి ముద్దు, ఇజ్రాయిల్‌ యుద్ధం ఆపాలి అనే నినాదాలతో కూడిన ప్లకార్డుతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కెఎస్‌విఎన్‌.మనోహర్‌, కరాటం ప్రవీణ్‌, రాయుడు శ్రీరామచంద్రమూర్తి, అధ్యాపకులు యాలంగి వరప్రసాద్‌, చోడే జాన్‌ పాల్‌, శ్రీనివాస్‌, సంసోన్‌, వెంకటేశ్‌, నాగరాజు, సూర్యకుమారి, స్నేహిత, వాణి, దివ్య పాల్గొన్నారు.