సమావేశంలో మాట్లాడుతున్న అంజిబాబు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పాలస్తీనాపై ఇజ్రాయిల్ నిరంతరం కొనసాగిస్తున్న మారణకాండను తక్షణమే ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజనేయులు, మండల కార్యదర్శి బి.రాముడు కోరారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలస్తీనాపై దాడుల వల్ల 10 వేల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. తక్షణమే ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు రాజు, షబ్బీర్, ఆది, నాగరాజు, తిక్కయ్య, ఈరన్న గౌడ్ పాల్గొన్నారు.