Nov 11,2023 20:24

ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో నేతలు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ అమాయకమైన పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తూ మహిళలు, చిన్నారుల ప్రాణాలను బలిగొనడం అన్యాయమన్నారు. లక్షల మందిని శరణార్థులు చేస్తూ ఆహారం, తాగునీరు అందక ఆర్తనాదాలు చేస్తున్న అమాయక ప్రజలకు అన్యాయం చేసే హక్కు ఏ దేశానికీ లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలన్నారు. ఇజ్రాయిల్‌ అన్యాక్రాంతం చేసిన పాలస్తీనా భూభాగాన్ని వారికి అప్పజెప్పాలన్నారు. పాలస్తినీయులపై దాడి అంతర్జాతీయంగా రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయన్నారు. పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయిల్‌ దాడి అన్యాయమని, దీన్ని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నాడ రాము, నోములు కొండ బూడిద జోగేశ్వరరావు, పొగాకు నారాయణరావు, ఎండి అజీజ్‌, అప్పలనాయుడు, తిరుమాని సత్యనారాయణ పాల్గొన్నారు.