Nov 09,2023 22:21

ప్రజాశక్తి-అమలాపురం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి అమరావతి నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాల పురోగతి ఇప్పటివరకు అప్పగించిన భవనాలు, నరేగా ద్వారా పని దినాలు కల్పన ఉపాధి అవకాశాలు కల్పన సరాసరి పని దినాలు సరాసరి వేతనం చెల్లింపు, వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా రి సర్వే తదితర పాలనా అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, 2023-24 రబీ సీజన్‌ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ జలవనరుల శాఖ సలహా మండళ్లు నిర్ణయాలు సాగునీటి లభ్యతను పరి గణనలోకి తీసుకొని రూపొందించా లన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను నిర్మాణాలను వేగవంతం చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ అనుసంధానంతో పనిని కోరుకుంటున్న వేతన జీవులకు సెల్పులలో పనులు కేటాయించి కనీస వేతనాలు చెల్లింపుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలూ సమాంతరంగా చేపడుతూ నిర్ధేశిత లక్ష్యాలు చేరుకుని భవిష్యత్తులో భూ వివాదాలకు చెక్‌ పెట్టే విధంగా రెవెన్యూ రికార్డులను స్వచ్చీకరించాలని ఆయన ఆదేశించారు. కుల గణనను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ముందుగా ఐదు సచివాలయాల పరిధిలో పైలెట్‌గా చేపట్టాలని సూచించారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేస్తూ పాడి రైతులకు పాల సేకరణ ద్వారా కనీస గిట్టుబాటు ధరలు కల్పించి పాడి రంగాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని వెళ్లాలని సూచించారు. ధాన్యం సేకరణకు గోనెసంచులు అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వలు చేసేందుకు వీలుగా చేపట్టిన బహుళార్థ ప్రయోజనాల సౌకర్య గోదాములు నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు ఆ యొక్క వసతులను అందు బాటులో తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.