Sep 29,2023 22:59

ప్రజాశక్తి-గుడివాడ : కేంద్రంలో, రాష్ట్రంలోనూ పాలకులు అనుసరిస్తున్న విధానాల వలన రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం స్థానిక సంఘ కార్యాలయంలో రైతు సంఘం కష్ణా జిల్లా కమిటీ సమావేశం కొలుసు శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని 550 రైతు సంఘాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని ఏడాది పైగా ఆందోళన బాట చేపట్టడంతో ఆ మూడు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దేశంలో 83 కోట్ల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి పని చేస్తున్నా రని వారి రుణాలను రద్దు చేయని పాలకులు 26మంది పారిశ్రా మికవేత్తల 12లక్షల రుణాలను రద్దు చేయ టం సిగ్గుచేటు అన్నారు. అక్టోబర్‌ 3న బ్లాక్‌ డే గా జరపాలని, నవంబర్‌ 26, 27, 28 తేదీలలో జరిగే కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు, సంఘం జిల్లా నాయకులు ఎల్‌ అజరుఘోష్‌, శొంఠి ఉమామహేశ్వరరావు, టి.సాంబ శివరావు, సిహెచ్‌ శ్రీహరి, వి.కష్ణారావు తదితరులు పాల్గొన్నారు.