రామాపురం : మండలంలోని గువ్వలచెరువు పరిధి లోని తూర్పు పాలకొండ, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీ పంలోని లోయల్లో చిరుత పులి పిల్లలుతో సంచారం చేస్తున్నట్లు గొర్రెలకాపర్లు, వాహనదారులు భయాం దోళనకు గురవుతున్నారు. కడప-రాయచోటి గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల దారులు, ప్రజలు, బాటసారిలు ఈ దారిలో నడవా లంటే బెంబెలెత్తిపోతున్నారు. పాలకొండలోని పపిరెడ్డికుంట. విప్లమడ పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో చిరుతలు సంచారం చేస్తున్నట్లు ఫారెస్ట్ అది óకారులు పేర్కొంటున్నారు. కర్నూలు-చిత్తూరు జాతీ య రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్లోలోని కోనేటి వద్ద కొలను వద్ద చిరుత తమ పిల్లలతో నివాసముండి సంచారం చేస్తున్నట్టు గొర్రెల కాపర్లుకు కనిపించినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు గగ్గోలమంటున్నారు. సంబంధిత అధికా రులు చర్యలు తీసుకొని చిరుతలను పట్టుకొని వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులకు ఎంతైనా ఉందని ప్రజలు తెలుపుతున్నారు. ఈ పాల కొండలు దట్టమైన అడవులు. చెట్లు పెరగడంతో మరోపక్క కొండలు, పెద్దపెద్ద ప్లేట్లు బండలు లోయలు అధికంగా ఉండడంతో అవి వాటినీ నివాసంగా ఏర్పరచుకొని కొండ పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీట్ ఆఫీసర్ గాయత్రిని వివరణ కోరగా తమ ఫారెస్ట్ పరిధిలోని పప్పిరెడ్డి కుంట విప్లమడ ప్రాంతాల పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుతలు తిరుగుతున్నట్లు ఫొటోలో కనిపించినట్టు చెప్పారు. గొర్రెలకాపరులు, ప్రజలు పాలకొండల ప్రాంత పరిధిలోకి వెళ్లవద్దని సూచించారు.










