
ప్రజాశక్తి - పాలకొల్లు
పట్టణంలో బుధవారం సాయంత్రం తేలికపాటి వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. పదిహేను రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. బుధవారం కూడా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది.