
ప్రజాశక్తి - పాలకొల్లు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లులో వైసిపి జెండా ఎగురవేయాలని ఉభయగోదావరి జిల్లాల వైసిపి సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోరారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన పాలకొల్లు అసెంబ్లీ నియోజ కవర్గ వైసిపి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 8న జరిగే సామాజిక బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని కోరారు. తమ పార్టీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రాధాన్యతిస్తోందన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా తనను కలవాలని కోరారు. మండలంలోని వివిధ కార్యకర్తలతో విడిగా సమావేశమయ్యారు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఈసారి వైసిపి జెండా రెపరెపలాడుతోందని వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపి చెప్పారు. ఈ సమావేశంలో టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్, యడ్ల తాతాజీ, చిలువూరి దత్తాత్రేయ వర్మ, నడపన గోవిందరాజులు, చిట్టూరి ఏడుకొండలు చందక సత్తిబాబు, జోగి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.