
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు పట్టణంలో చిన్నారుల అభిరుచికి తగ్గట్టు కిడ్స్ ప్లే జోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపి చెప్పారు. ఇప్పటివరకు నగరాలు, పెద్ద పట్టణాల్లో ఉండే కిడ్స్ ప్లే జోన్‌ను పాలకొల్లులో ఏర్పాటు చేశారు. కిడ్స్ ప్లే జోన్‌ను గుడాల గోపి ఆదివారం ప్రారంభించారు. దీనిలో ప్లే స్టేషన్, మ్యూజిక్ స్టేషన్, సెల్ఫీ సిస్టం, జంపింగ్ బౌన్స్, రోప్ లోడర్ వంటి అనేక టార్సు ఉండటం పట్ల ఆయన నిర్వాహకులు కిరణ్ కుమార్‌ను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, ఇఒ యాళ్ల సూర్యనారాయణ, ఉనికిల శ్రీనివాస్, పాలపర్తి కృపానంద్, రేలంగి శ్రీను పాల్గొన్నారు.