Aug 12,2023 17:18

ప్రజాశక్తి - పాలకొల్లు
డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి శనివారం ఆకస్మికంగా పాలకొల్లు విచ్చేశారు. స్థానిక లైఫ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో ఇటువంటి ఆసుపత్రి ఉండడం ప్రజల అదృష్టన్నారు. ఆయనకు ఆసుపత్రి నిర్వాహకులు తటవర్తి కృష్ణమూర్తి, అడ్డాల వాసు, తెలనాకుల సురేష్‌, సుధాకర్‌, రాజు గజమాల వేసి స్వాగతం పలికారు. డిజిపి వెంట ఏలూరు రేంజ్‌ డిఐజి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, సిఐలు డి.రాంబాబు కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. నరసాపురంలోని డిఎస్‌పి నూతన ఆఫీస్‌ ప్రారంభం సందర్భంగా డిజిపి జిల్లా విచ్చేశారు.