
ప్రజాశక్తి - పాలకొల్లు
స్థానిక లజపతిరారు పేట మాంటిస్సోరి స్కూల్లో సోమవారం విద్యార్థులు ఫ్లవర్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రకతిని అత్యంత రమణీయంగా, శోభాయమానంగా ఉంచడమే కాకుండా పచ్చగా ఉంచాలనే భావన కలిగించడం ద్వారా, వాతావరణ సమతుల్యాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిందే ఈ ఫ్లవర్ డే అని స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ కెవి.కృష్ణవర్మ అన్నారు. ఈ ప్రకృతిలో వివిధ రకాలైన పూలు, అనేక ఔషధ గుణాలను కలిగి, సువాసనను వెదజల్లుతూ ప్రకృతికి శోభ చేకూర్చుతూ మానవాళికి ఎంతగానో మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాల ప్రాంగణంలో పూల మొక్కలు నాటారు. పాఠశాల బయాలజీ టీచర్ రాజేశ్వరి మాట్లాడుతూ వివిధ రకాలైన పూల విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా వారిని చైతన్యవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎస్‌పిఎస్.ప్రకాష్‌రావు పాల్గొన్నారు.