Apr 21,2023 01:21
విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న అధ్యాపకులు

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాలలో పాలిటెక్నిక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు విడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ ఎస్‌ లక్ష్మణరావు సంయుక్తంగా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిద వేణుగోపాలరావు మాట్లాడుతూ సమాజంలోని ఉన్నత స్థాయిలోని వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అంకితభావంతో కృషిచేసి సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. సమాజ, దేశ అభివద్ధికి పాటుపడాలని తెలిపారు. పాలిటెక్నిక్‌ డెప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ కె విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులను, విద్యను నేర్పిన గురువులను గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞతతా భావంతో మెలగాలని అన్నారు. విద్యార్థులు సరైన రీతిలో కృషి చేసినట్లైతే అత్యుత్తమ స్థాయిలో స్థిరపడవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకుండా, ఆధునిక టెక్నాలజీలను నేర్చుకొని ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం విధ్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ సందేశాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.