ప్రజాశక్తి కంచికచర్ల : కంచికచర్ల మండలం పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల లో 2023 లో జాయిన్ అయిన విద్యార్థులకు బుధవారం పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు పారంభించారు. ఈ సందర్భంగా ఇండక్షన్ కార్యక్రమాన్ని కళాశాల పాలకవర్గ కార్యదర్శి కె రామ్మోహన్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్స్‌లో 4 బ్రాంచులు) ఉన్నాయని, పాలిటెక్నిక్ కోర్స్‌తో మంచి ఉపాధి అవకాశాలుంటాయని, ఈ టెక్నికల్ కోర్స్‌లో మంచి ప్రణాళికతో పాటు, కళాశాలలో ఉన్న ప్రయోగశాలల ద్వారా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా విజయం సాధించవచ్చని తెలియ చేసారు. పాలిటెక్నిక్‌లో సబ్జక్ట్స్, పాఠ్యాంశాల ప్రాముఖ్యతను, కళాశాల విధి విధానాలను తల్లితండ్రులకు వివరించారు. ళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యమ్.శశిధర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొంద వచ్చునని, అంతే కాకుండా పాలిటెక్నిక్ కోర్స్‌తో గవర్నమెంట్ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని, ఇండియన్ ఆర్మీ, రైల్వే, ఎయిర్ లైన్స్, ఇరిగేషన్, ట్రాన్స్కో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కూడా పొందవచ్చన్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం శ్రీదేవి సిబ్బంది పాల్గొన్నారు.










