ప్రజాశక్తి -అరకులోయరూరల్:పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుకేక పాదయాత్రకు సంఘీభావంగా ఆదివారం మండలంలోని సుంకరమెట్ట వారపు సంతలో సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు, నాయకులు పొద్దు బాలదేవ్, రామన్న మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పోలవరం బాధితులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు.నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, పద్మాపురం ఉపసర్పంచ్ జన్ని భగత్ రామ్, పాంగి నానిబాబు, సిహెచ్ గురుమూర్తి, గత్తుం బుజ్జి బాబు, జి.సత్యారావు, టి.జోషి, కె.బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.










