Jul 02,2023 00:00

విరాళాలు స్వీకరిస్తున్న ఉమామహేశ్వరరావు, నాయకులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:సిపిఎం పోలవరం పోరుకేక పాదయాత్రకు మద్దతుగా అరకులోయలో సిఐటియు ఆధ్వర్యంలో శనివారం సంఘీభావ నిధిని కార్మికుల వద్ద సేకరించామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలు ముంపునకు గురువుతున్నా నష్టపరిహారం చెల్లించాలనే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తెలిపారు. ముంపునకు గురవుతున్న గిరిజనులకు పునరావాసం కల్పించి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలవరం పోరు కేక పాదయాత్రకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కె రామచందర్‌, నందీశ్వరరావు, సింహాచలం, గౌర్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: పోలవరం నిర్వాసితుల పోరు కేక మహా పాదయాత్రకు స్థానిక సిపిఎం నాయకులు శనివారం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌బి పోతురాజు, మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సంఘీభావ నిధి విరాళాలను సేకరించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలన్నారు. గోదావరి వరద నుండి రక్షించడానికి ప్రభుత్వాలు ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని, వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు వి సింహాచలం, వి.మహేశ్వరరావు, పి.దొంబు పాల్గొన్నారు.