పాదయాత్ర కరపత్రాలు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : 3న చేపట్టే సిపిఎం పార్టీ పాదయాత్ర విజయవంతం చేయాలని ఆదివారం రైతు సంఘ నాయకులు కాకు వెంకటయ్య కరపత్రాలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని కుర్రపల్లి కాశినాయన సెంటర్ దుకాణ యాజమానులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3వ తేదీ ఉదయం 10 గంటలకు బసినేనిపల్లి నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర బయల్దేరుతుందన్నారు. ఈ పాదయాత్రను సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభిస్తారన్నారు. కార్యకర్తలు సానుభూతిపరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీతారాంపురం మండల కార్యదర్శి కోడె రమణయ్య, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శి, సభ్యులు పాల్గొన్నారు.










