Oct 20,2023 23:20

ప్రజాశక్తి- ఘంటసాల : పాడిరైతుల సంక్షేమమే కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ధ్యేయమని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. మండల పరిధిలోని చిట్టూర్పు ఎంపిఏ నందు శుక్రవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రైతులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో కష్ణా మిల్క్‌ యూనియన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, రైతులు వాటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 60 వేల విలువ చేసే ప్రోత్సాహక బహుమతులను 80 మంది పాడి రైతులకు అంద జేశారు. సంఘ అధ్యక్షులు దాసరి ప్రభు కుమార్‌, కష్ణా మిల్క్‌ యూనియన్‌ డైరెక్టర్‌ వేమూరి సాయి వెంకటరమణ, గుత్తికొండ వరప్రసాద్‌, పరుచూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.