మాట్లాడుతున్న సింహాద్రిప్పడు
ప్రజాశక్తి-కోటవురట్ల: రైతు భరోసా కేంద్రాల వద్ద పశు వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలని పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సింహాద్రిప్పడు సూచించారు. సోమవారం పశు వైద్యశాల వద్ద కోటవురట్ల, మాకవరపాలెం మండలాల సిబ్బందితో సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పశుగ్రాసం విత్తనాల సరఫరా, పాడి పశువులకు అందిస్తున్న ఇన్సూరెన్స్, మందుల కొరత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి పడాల్, పాములవాక వైద్యాధికారిణి హరిప్రియ, ఇరు మండలాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










