ప్రజాశక్తి-అచ్యుతాపురం
పాల రైతుల సంక్షేమమే లక్ష్యంగా హెరిటేజ్ డెయిరీ సేవలు అందిస్తుందని హెరిటేజ్ డెయిరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మండలంలోని పద్మరాజుపేట హెరిటేజ్ డెయిరీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. డెయిరీ సిబ్బందితో పాల ఉత్పత్తులు, రైతులు, పశువులు తదితర వాటిపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా ప్లాంట్లో కల్పించిన సౌకర్యాలు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెరిటేజ్ డెయిరీ అందిస్తున్న సేవలను పాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాడి రైతులకు డెయిరీ ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డెయిరీ ప్రోక్యూర్‌మెంట్ హెడ్ ఎస్.రామ్మోహన్‌రావు, జోనల్ మేనేజర్ వి.దివాకర్ రావు, రీజనల్ మేనేజర్ పి.నాగ అప్పారావు, స్థానిక మేనేజర్ కూండ్రపు శేషు, ఆపరేటర్ వై.ప్రసాద్ ల్యాబ్ అసిస్టెంట్ వి.నానాజీ పాల్గొన్నారు.










