ప్రజాశక్తి - కాకినాడ
జగనన్న పాల వెల్లువ-ఎపి అమూల్ ప్రాజెక్టు గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ప్రాజెక్టు అని ఈ ప్రాజెక్టును జిల్లాలో విజయవంతంగా అమలుచేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఎపిడిడిసిఎఫ్) ఎండీ అహ్మద్‌బాబు అన్నారు. కాకినాడ సూర్య కళామందిర్ ఆడిటోరియంలో బుధవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వ ర్యంలో జగనన్న పాలవెల్లువ-ఎపి అమూల్ ప్రాజెక్టుపై నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎండీ అహ్మద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియా, అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్ రావు, అమూల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్ధక, రెవెన్యూ, పంచాయతీ రాజ్, సహకార, గ్రామీణాభివద్ధి తదితర శాఖల జిల్లా, మండల, గ్రామస్థాయి బృందాల సభ్యులకు జగనన్న పాల వెల్లువ-ఎపి అమూల్ ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధివిధానాలను అహ్మద్‌బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జగనన్న పాలవెల్లువ కార్యక్ర మానికి సంబంధించి జిల్లాస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, మహిళా డెయిరీ అసోసియేషన్ సెంటర్లు, మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటుపై వివరించారు. ఈ సదర్భంగా అహ్మద్‌బాబు మాట్లా డుతూ . దేశంలోనే అత్యంత నాణ్యమైన పాల ఉత్పత్తిలో నాలుగో స్థానంలో రాష్ట్రం ఉన్నప్పటికీ పాడి రైతులు తగిన ధర పొందలేకపోతున్నారన్నారు. ఈ పరిస్థితిని చూసిన ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ-ఎపి అమూల్ ప్రాజెక్టును ప్రారం భించిందని వివరించారు. ఈ ప్రాజెక్టుపై గ్రామస్థాయిలో పాడి రైతులకు, స్వయం సహాయ సంఘాల సమావేశాల్లో అవగాహన పెంపొం దించేలా జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. ఆర్‌బికె ఉన్న గ్రామంతో పాటు దాని పరిధిలోని ఆవాసాల్లోనూ ఎఎంసియులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య గ్రామంలో బిఎంసియు అందు బాటులో ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కతికా శుక్లా మాట్లాడుతూ త్వరలో జిల్లాలో తొలిదశలో 14 మండలాల పరిధిలోని 200 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ-ఏపీ అమూల్ ప్రాజెక్టు అమలు కానుందని.. ఇందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకుని సిద్ధంగా ప్రాజెక్టు ప్రయోజనాలను పాడి రైతు లకు పూర్తిస్థాయిలో వివరించా లన్నారు. కార్యక్రమంలో అమూల్ ప్రతినిధులతో పాటు జడ్‌పి సిఇఒ ఎన్‌వివి సత్యనారాయణ, ఇన్‌ఛార్జ్ డిఆర్‌ఒ కె.శ్రీరమణి, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిలోలు బివి.రమణ, జె.సీతారామారావు, జిల్లా, మండల, గ్రామస్థాయి బృందాల సభ్యులు తదితరులు హాజరయ్యారు.
శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎపిడిడిఎస్‌ఎఫ్ అహ్మద్ బాబు










